పాటిమీద పత్తి చేను
మొగ్గలెన్నో వేసింది
పువ్వులెన్నో పూసింది
కాయలేన్నో కాసింది
పత్తికాయలు పగిలాయి
వెన్నెల వోలె వెలిగాయి
రైతన్న వచ్చి చూసాడు
ఎంతో మురిసిపోయాడు
పల్లెకు పరుగులు తీశాడు
కూలి వాళ్లను పిలిచాడు
చేనులోకి పంపాడు
పత్తి నంతా తెంపారు
సంచుల్లో నింపారు
ఎడ్ల బండిపై వేశారు
రైతు బండి ఎక్కాడు
సంతకేమో వెళ్ళాడు
బస్తాలన్నీ దించాడు
తూకం వేసి అమ్మాడు
చేతికి రొక్కం వచ్చింది
ఇంటి వద్దకు చేరాడు
రొక్కం భార్యకు ఇచ్చాడు
కూలీలకు డబ్బులిచ్చింది
కొన్ని సరుకులు తెచ్చింది
అత్త చేతికి ఇచ్చింది
రొక్కము ఆదా చేసింది
పండగకు బట్టలు తెచ్చింది
పిల్లలకు పెద్దలకు ఇచ్చింది
పిండి వంటలు చేసింది
అందరినీ పిలిచింది
చేసిన వంటలు పెట్టింది
కడుపునిండా తిన్నారు
కలిసిమెలిసి ఉన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి