సుప్రభాత కవిత : -బృంద
సమస్యల సుడిలో చిక్కిన 
భయాల వెనకాల నక్కిన 
బేల మనసుకు చేయందించ
ఇలకు దిగివచ్చిన వెలుగురేఖలు

తమస్సును తరిమే జ్యోతి గా 
ఉషస్సును తెచ్చే కాంతిగా 
పుడమికి పూచిన వెలుగుపువ్వులా 
పుత్తడి వెలుగులు నింపే కాంతులు

ఉషోదయాన పలుకరించి 
తుషార శీతల సమీరాల తో
నిశి నిట్టూరుస్తూ తరలిపోయేలా
కదిలివచ్చిన కనకకిరణాలు

పురులు విప్పిన సంతోషాలకు 
సోయగాల సిరులు తోడై 
విచ్చిన విరుల తీరున 
స్వేచ్ఛగా  నవ్వే మానసం!

మధుప గానాలు ప్రతిధ్వనించే
మధువనిలో ఊగే పువ్వుల 
మకరందాలు  జాలువార తలవూపే
మాధవీలతల బృందాలు!

మనసే రీతిగా ఉండునో 
జగమారీతిగా తోచునేమో 
ఆనందమైనా ఆందోళనైనా 
అడుగుమారగానే మారే వైనాలు

అంచనాలతో మొదలై 
అనుభవంగా మిగిలే 
అనుభూతుల అల్లికలే 
అందరి హృదయగానాలు 

అందమైన అనుభవాలను 
ఆహ్వానిస్తూ...

🌸🌸సుప్రభాతం 🌸🌸
సమస్యల సుడిలో చిక్కిన 
భయాల వెనకాల నక్కిన 
బేల మనసుకు చేయందించ
ఇలకు దిగివచ్చిన వెలుగురేఖలు

తమస్సును తరిమే జ్యోతి గా 
ఉషస్సును తెచ్చే కాంతిగా 
పుడమికి పూచిన వెలుగుపువ్వులా 
పుత్తడి వెలుగులు నింపే కాంతులు

ఉషోదయాన పలుకరించి 
తుషార శీతల సమీరాల తో
నిశి నిట్టూరుస్తూ తరలిపోయేలా
కదిలివచ్చిన కనకకిరణాలు

పురులు విప్పిన సంతోషాలకు 
సోయగాల సిరులు తోడై 
విచ్చిన విరుల తీరున 
స్వేచ్ఛగా  నవ్వే మానసం!

మధుప గానాలు ప్రతిధ్వనించే
మధువనిలో ఊగే పువ్వుల 
మకరందాలు  జాలువార తలవూపే
మాధవీలతల బృందాలు!

మనసే రీతిగా ఉండునో 
జగమారీతిగా తోచునేమో 
ఆనందమైనా ఆందోళనైనా 
అడుగుమారగానే మారే వైనాలు

అంచనాలతో మొదలై 
అనుభవంగా మిగిలే 
అనుభూతుల అల్లికలే 
అందరి హృదయగానాలు 

అందమైన అనుభవాలను 
ఆహ్వానిస్తూ...

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు