ఉపాధ్యాయులు తాము పని చేస్తున్న పాఠశాలల్లోని తరగతి గదుల్ని రంగు రంగుల బొమ్మలు, అక్షరాలు, పదాలు వివిధ విషయాలతో ఆకర్షనీయంగా తయారు చేసుకోవాలని, దీంతో పిల్లల అభ్యసనం సులభతరమవుతుందని
జిల్లా రిసోర్స్ పర్సన్ ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంఈఓ సిరిమల్ల మహేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల అయిదో రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన పలు విషయాలను నమోదు చేసుకున్నారు.
అనంతరం డీఆర్పీ ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ అమలు విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందువల్ల 2025-2026 విద్యా సంవత్సరంలో ఎఫ్ఎల్ఎన్ లో పెద్దపల్లి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఈర్ల సమ్మయ్య కోరారు. తర్వాత ఎంఈఓ సిరిమల్ల మహేష్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో తాము నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో పగడ్బందీగా అమలు చేయాలని, ఈ సారి ఎఫ్ఎల్ఎన్ లో మండలాన్ని జిల్లాలోనే అగ్ర భాగాన నిలపాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచాలని, వారికి ఆసక్తి కలిగించే విధంగా వివిధ రకాల వినూత్న బోధనాభ్యసన ప్రక్రియలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించాలని ఎంఈఓ మహేష్ ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లు గుంటి వేణుగోపాల్, కుసుమ దేవేందర్, పి.సదయ్య, కోయల్కర్ స్వప్న, గుండా మల్లికార్జున్, అంబాల భానుచందర్, బండారి కుమార్, బి.రాజేందర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి