కాలం ఒకటే అవిభాజ్యం
తిరిగే భూమి దాని అంతరంగం
నిన్న నేడు రేపు విభాజకాలు
లిపి ఒక్కటే
వివిధ వైవిధ్య నది తరంగాలు
కవిత నవల నాటకం కథా కమామీషు
అంతర్యామి సృజన విహంగాలు
అదేమి చిత్రమోగాని కల
రోజొక్కతీరు జొన్నకంకిలా నవ్వే
నిద్రలేని రాత్రి చీకటి మత్తును దుల్పి
పాయే
నేనేమే ఇంటిముందు
కలే నిజమనుకొని బేలగా
రాత్రి పాటను పగలంతా పాడుతూ
స్వప్పలిపి మళ్ళీ రాస్తున్నా ఇలా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి