మేకలబండకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం

  నెల్లూరులోని ఎస్.ఆర్.కె విశ్వసాయి స్కూల్లో శనివారం  జరిగిన సాహితీ కార్యక్రమంలో తిరుపతి  రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజుకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం అందజేశారు. ఆయన రచించిన  “మేకల బండ” నవలకు గానూ ఈ నవలా పురస్కారం లభించింది . గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రదేవిగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమంలో రచయితలు డాక్టర్ సుంకర గోపాల్, అద్దేపల్లి ప్రభు, డాక్టర్ పెళ్లూరు సునీల్,  శ్రీమతి గాయత్రి, కె.ఎ. ముని సురేష్ పిళ్లే,   పేట యుగంధర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
కామెంట్‌లు