గజల్
=====
నీ స్నేహమె వెన్నెలయై
కురిసెనులే నామదిలో
నీమాటలె విరిజల్లై
విరిసెనులే నామదిలో
జగతిలోన చెలిమి కంటె
మిన్నేదీ లేదుకదా
స్నేహమంటె మనదేనని
నిలిచెనులే నామదిలో
హృదయభార మంతతీరె
నీచెలిమీ నీడలోన
నాబ్రతుకే ధన్యమనీ
తలచెనులే నామదిలో
ఎన్నెన్నీ జన్మలదో
యీబంధం మన నడుమా
ఆనందం పొంగిపోతు
పిలిచెనులే నామదిలో
ఒకరినొకరు తెలుసుకొనీ
బ్రతుకుటయే చెలిమికదా
మనసారా సంతసంగ
మురిసెనులే నామదిలో
చెలి మంటే లాభ మొచ్చు
వ్యాపారం కాదు సుమా
గతకాలపు వేదనలను
మరువనులే నామదిలో
పెనవేసిన గుండెలలో
స్నేహలక్ష్మి సిరులు కురియు
చెలిమి నీడ చల్లదనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి