పాఠశాలలో కొత్తగా చేరారు సైన్స్ మాస్టర్. రాగానే ఆ సబ్జెక్టులో విద్యార్థులు ఎలా ఉన్నారో పరీక్షించాలని అనుకున్నారు. స్లిప్ టెస్ట్ పెట్టారు. సోము చదువులో వీక్. సైన్సులో మరీ వీక్. చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సైన్స్ మాస్టర్ సోమూను పిలిచి నిలదీసినాడు. నిజానికి తాను తెలివైన విద్యార్థినే కానీ ఆ స్లిప్ టెస్ట్ రాసిన రోజు బాగా జ్వరం వచ్చింది అని, తల్లిదండ్రులు ఇంట్లో రెస్ట్ తీసుకోమని బతిమాలినా వినకుండా బడికి వచ్చానని అబద్దం చెప్పాడు సోము. "ఈసారి పెద్ద పరీక్ష జరగబోతుంది కదా! నువ్వు తెలివైన విద్యార్థివి అయితే అందులో మార్కులు బాగా వస్తాయి. ఏం బాధపడకు." అన్నాడు ఉపాధ్యాయుడు.
సమ్మెటివ్ పరీక్షలు మొదలు అయ్యాయి. సోముకు ముందు వెనుక ఇద్దారూ ఆ క్లాసులో టాప్ వచ్చే విద్యార్థులు వాసు, రాములు. "ప్లీజ్! ఈసారికి ఎలాగో మీరు రాసే జవాబులు చూపించండి ప్లీజ్!" అన్నాడు సోము. ఇద్దరి దాంట్లో చూస్తూ సైన్స్ పరీక్ష రాసినాడు సోము.
ఆశ్చర్యంగా వాసు, రాముల మార్కులు దాటి క్లాస్ ఫస్ట్ వచ్చాడు సోము. ఉపాధ్యాయులు సోమూను అభినందించారు. "సోము! నీకు మంచి బహుమతి ఇవ్వాలని ఉంది. కానీ నీకు ఒక బంగారు అవకాశం ఇస్తాను. రంగ, రాజేంద్ర, కృష్ణ, అజయ్, భీమూలు సైన్సులో చాలా వెనుకబడి ఉన్నారు. వీరికి కనీస సామర్థ్యాలు కూడా లేవు. ఈ ఐదుగురిని నీ చేతిలో పెడుతున్నా. రోజూ సాయంత్రం వేళ వాళ్ళను మీ ఇంటికి తీసుకెళ్ళి, నీ విద్య వారికి దానం చేస్తూ 3 నెలల్లో నీ అంత తెలివైన వారిని వారిని చేయాలి. సరేనా? ఆప్పుడు నీకు ఊహించని పెద్ద బహుమతి ఇస్తాను." అని ప్రకటించారు సైన్స్ టీచర్. ఉపాధ్యాయులు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. "చచ్చింది గొర్రె." అన్నది అక్కడే ఉన్న అపర్ణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి