ఆలస్యం…
అమృతం విషం
అన్నట్లు పండితులు...
కవిత్వం...
ఒక మధుర భావన...
కాసింత పాపం...కాసింత శాపం...
నియంత్రణ లేకున్న అదొక నరక కూపం..
కవిత్వం...
ఒక రొచ్చు కాదు
కార్చిచ్చు కాదు
ఒక రహస్య తంత్రం...
కవిత్వం...
ఒక ఉచ్చు కాదు
అదొక ఊరేగే ఊహల పల్లకి...
కవిత్వం...
ఒక మత్తు మందు కాదు
అది ఒక మహా మౌన విస్పోటనం...
కవిత్వం...
నిన్న చిగురించిన...ఒక హాబి...
నేడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
ఊపిరి తీస్తున్న...ఒక ఊబి...
కవిత్వం...
నిన్న ఒక "పూలతోటగా" వికసించే...
నేడది "సర్పాల సరస్సుగా" మారే...
అక్షరాల ముంగిట
జీవితాన్ని ఫణంగా పెట్టినందుకు
ఆరోగ్యం అడుగడుగునా బలైపోయే...
నీ చుట్టూ సమస్యలే...
నీ నెత్తిన బరువు బాధ్యతలే...
నీవొక ఇంటి యజమానివి...
కవిత్వం వింటూ...
కవిత్వం తింటూ...
కవిత్వం కలగంటూ ...
అక్షరాలతో ఆడుకుంటూ...
ఊహల్లో ఊరేగుతూఉంటే
ఖచ్చితంగా జీవితం ఒక శాపమే...
కుటుంబ బాధ్యతలపై
ఏమాత్రం శ్రద్ధ ఆసక్తి లేక...
నిద్ర లేచింది మొదలు
బద్దకంలో మునిగి తేలుతూ...
24/7 సెల్లు కవిత్వంగా
జీవించడం ఎంత సిగ్గుచేటు..
ముందు జాగ్రత్త లేకున్న
మునిగి పోదా నీ లైఫ్ బోటు...
కానీ కాలాన్ని జయించిన వారికి...
సెల్లు శక్తిని నియంత్రించే వారికి...
అక్షరాలను ఆరాధించే వారికి...
అక్షర దీపాలు వెలిగించే వారికి...
కవిత్వం...ఒక వడ్డించిన విస్తరి...
అది ఒక సన్మానాల సత్కారాల సంత...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి