ఋతువులు రాకముందే మేఘాలు ప్రయాణమై
అంతరించిపోతున్నవీ.
ఎండలు కాయకముందే ఎండమావులు
దూరమై మాయమవుతున్నవీ.
తొలకరి రాకముందే నేల బీటలు వారి
నోళ్లు తెరిచి మూగబోతున్నదీ.
పూత- కాయ - కాయక ముందే నేల రాలి -కాలిపోతుందీ.
మొదలు నరికిన మోడు చెదిరిపోయి బెదిరిపోతుంది.
మొలవాల్సిన మొక్కలు లెక్కలు తప్పి కలుపు మొక్కల్లో కలిసిపోతున్నవీ.
కొత్త కొత్త విత్తనాలతో నోరులేని నేల వేరువేరుగా విడిపోతున్నది.
అమావాస్య రాకముందే పున్నమి పురుడుపోసుకుందేమో చీకటి కౌగిట వెన్నెల కరిగిపోతుంది.
తెలుపు నలుపులు ఏడు రంగుల ఊయల లూగ
క ముందే రాత్రికి పట్టాభిషేకం చేస్తున్నవి.
అంధకారంలో బంధించబడ్డ నేత్రాలు తాళపత్ర గ్రంధాలు చదువుతున్నవీ.
చెదిరిపోయిన శాసనాలు చరిత్రను వెతుకుతూ తప్పిపోతున్నవీ.
గాలిని వదులుకొని నేలను తప్పించుకొని నీటిని కాదని దూరంగా సాగిపోతున్న ప్రాణం కోసం
ఆకాశం ఏం చేసిందో తెలుసా!?-విస్తరిస్తుంది!!.
పాలెం ఆర్టీసీ-డ్రైవర్-@ షాకిరా పాషాకీ నివాళి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి