సుప్రభాత కవిత : -బృంద
ముందే వచ్చిన సంతోషాలను
పొందెను మది ఉల్లాసంగా
విందుగ తోచిన అందాలను
వందగ దాచెను పండగగా...

తలవకనే దొరికిన వరమై
తగిలిన పూలబంతిలాగా తపించిన సమయాన ఊరటగా 
తరించెను భువి తడిసి హాయిగా...

జల్లున తడిసిన పచ్చిక మీద 
ఘల్లున మోగుతూ మువ్వలా 
వెల్లువగా కురిసిన చినుకులు 
వసుధకు అందెలు కట్టెనుగా

తలపై నిలిచిన చినుకులతో 
తమకై వచ్చే దైవం కోసం
తపస్సు చేస్తూ వేచినవేమో
తరుముతు మబ్బుల కోపంగా!

దండిగా చేరిన నీటితో
నిండుగా పొంగే వాగులన్నీ 
నిండిన నెలల నెలతలా సాగేను
రెండు ఒడ్లను ఒరుసుకోగా...

చిందేను నీరే చల్లగా
చిలికేను హాయే వెచ్చగా
చివరకు మబ్బులే తొలిగి
వచ్చును వేకువ తెల్లగా...

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు