అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో చెట్లు ఉండేవి కావు. చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు కురిసేవి కావు. వర్షాలు కురవకపోవడం వల్ల చెరువులు బావులు కుంటలు నదులు నిండకపోయేవి. ఆ రాజ్యం ప్రజలు నీళ్ల కోసం పక్క రాజ్యాలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి. ఇదంతా చూసినా ఆ రాజు చాలా కుమిలిపోయాడు. ఏదైనా చేసి ఈ రాజ్యాన్ని పచ్చటి రాజ్యంగా చేయాలని తన సైన్యాన్ని పిలిచి రాజ్యం మొత్తం చెట్లతో నింపమన్నాడు. సైనికులు పక్క రాజ్యాలకు వెళ్లి చాలా మొక్కలు తీసుకొచ్చారు. ఆ ముక్కలను రాజ్యం మొత్తం నాటారు. మళ్లీ పక్క రాజ్యాలకు వెళ్లి నీళ్లు తెచ్చారు ఆ మొక్కలకు పోశారు. మరుసటి రోజే ఆ మొక్కలు ఎండిపోయాయి. ఇదంతా చూసినా రాజు ఒక పూజారిని పిలిపించాడు. పూజారి రాజుతో మీ రాజ్యానికి ఒక శాపం ఉంది. అదేమిటి అంటే మీ ముత్తాతలు కాలంలో ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి ఒక మొక్కను నాటాడు. మొక్క చెట్టు అయింది. ఆ చెట్టు కిందనే ధ్యానం చేసేవాడు. ఒకరోజు మీ ముత్తాత ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఇక్కడ చెరువు తవ్విస్తే బాగుంటుంది అని చెరువు తోవడానికి ఈ చెట్టు అడ్డొస్తుందని ఆ చెట్టును నరికేశాడు. అది చూసిన ఋషి శాపం పెట్టాడు. అది నువ్వు చెట్టును నరికి చెరువును నిర్మిస్తున్నావు కాబట్టి నీ రాజ్యంలో ఇకనుంచి ఒక చెట్టు కూడా ఉండదు. వర్షాలు కురువవు. బావులు చెరువులు కుంటలు నదులు ఎండిపోతాయి. ఇదేనా షాపు అని ఆ రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మీ రాజ్యం ఇలా మారిపోయింది అని పూజారి చెప్పాడు. రాజు మరి ఈ శాపం నుంచి విముక్తి ఎట్లా అని అడిగాడు. పూజారి మీ ముత్తాత రుషి చెట్లు ఎక్కడ నరికాడో అక్కడ మరో మొక్క నాటాలి అని చెప్పాడు. రాజు సరే స్వామి అని బటులారా మీరు వెళ్లి ఒక మొక్కను తీసుకురండి అని తెచ్చిన మొక్కలు రాజు అదే స్థానంలో నాటి పూజ జరిపాడు. కొంతకాలానికి ఆ చెట్టు పెద్దగాయి ఆ రాజ్యం అంతా చెట్లు పెరిగాయి. చెరువులు నదులు కుంటలు బావులు నిండిపోయేలా వర్షాలు కురిసాయి. రాజు ప్రజలు ఎంతో సంతోషించారు. ఇక అప్పటినుంచి రాజ్యం మొత్తం పచ్చగా తయారై అందరూ సుఖసంతోషాలతో జీవించసాగారు.
రాజ్యానికి శాపం:- - మారోజు శివమణి- ఆరవ తరగతి - ప్రభుత్వ ఉన్నత పాఠశాల- డైట్ గొల్లగూడ నల్గొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి