విశ్వసుందరి!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
ఆకాశం 
ఏం అందంగా ఉంటుందని 
అంతగా ఇష్టపడతాం!
కన్నార్పకుండా చూస్తుంటాం!
గొప్పగా అనుభూతి చెందుతాం!!

సముద్రం 
ఏం అందంగా ఉంటుందని 
మనసు పారేసుకుంటాం!!
కన్నార్పకుండా చూస్తూ ఉంటాం!
గొప్పగా అనుభూతి చెందుతాం!!

పచ్చని అడివి 
ఎంత అందంగా ఉంటుందని 
మనసిచ్చేస్తాం!!
కన్నార్పకుండా చూస్తుంటాం!!
గొప్పగా అనుభూతి చెందుతాం!!

మహా పర్వతం 
ఎంత అందంగా ఉంటుందని 
అంతగా ఇష్టపడతాం!!
మన మనసును దాని పాదాల కింద దాచిపెడతాం.!!
మన చూపు
దాని శిఖరం వైపే ఎందుకుంటుంది!!?

ఆకాశం అడవి సముద్రం పర్వతం 
ప్రతిరూపం ఆమె!!
రక్త మాంసాల ముగ్ధ ఆమె!!

అద్భుతమైన మ్యాగ్నెట్ ఆమె 
డైనమిక్ డైమండ్ ఆమె!!
అందం ఆమె- విశ్వగంధం ఆమె
విశ్వ సుందరి ఆమె!!?

తెలంగాణలో విశ్వసుందరి పోటీలను పురస్కరించుకొని. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు