అది ఒక నిసంపాతం.(అర్ధరాత్రి)ఆర్తనాదా లతో, అలజడులతో
రెండు వందల ఏండ్లు అట్టుడికిన భరత భూమి ఆ నిశీధిలో
విడిచింది పెద్ద నిట్టూర్పు.జై కొట్టింది "వందే మాతరం" అంటూ.
ఆ నిశీది అందించింది స్వాతంత్ర్యం మనకు.
అదే అదే ఆగష్టు 15,
1947.భారతీయుల కది నిశీధి కాదు, తరుణ తరణి ఆగమనోదయం.మానవునికి అవసరమైన స్వేచ్ఛ స్వాతంత్ర్య సంపదలు
దక్కిన మహోదయం.
సారధి లేని రథంలా సాగలేక పరాయి పాలనలో.
పాడుబడిన మన
స్వాతంత్ర్య రథం
ఒక మహాత్ముని
సారథ్యంలో కదిలింది "పదండి ముందుకు పదండి"అంటూ పరుగెత్తిస్తే,
గుమ్మం దాటని ముద్దు
గుమ్మలు సైతం,వీర విహారం చేసారు.
పేర్లు చెప్పలేం పెద్దదే లిస్టు. గాంధీ, నెహ్రూ,
పటేల్, అంబేద్కర్,సావర్కర్ ఆల్లూరి ఇలా కొందరు ముందునడువగా.ప్రతి సామాన్యుడు ఒక
తుపాకి గుండై దూసుకొని పోయాడు
తెల్లవాడి గుండెల్లో తూట్లు పొడుస్తూ.
తెల్లవాని ఖంగు తినిపించిన నారీమణులు ఎందరో!
కస్తూర్బా,సరోజినీ, విజయలక్ష్మి పండిట్,ఝాన్సీ.,హజ్రత్ మహల్,ఉదాదేవి
(ఈమె దళిత నాయకురాలు) వీరంతా దేశీయ మహిళామణులు.
భరతమాత కొరకు పోరాడిన
విదేశీయ మహిళల
సహకారం సదా స్మరించాలి..
బికాజీ కామా: (గాంధీ. బురీ! వృద్దగాంధి అని పిలిచేవారు ఈమెను.)
కామా మొదటిగా మన జెండాను జర్మన్ సభలో ఎగరవేసిన నాయకురాలు. అనిబీసెంట్ సేవలు విస్తృతమైనవి. ఈమె థియోలాసిఫికల్ సొసైటి ముఖ్య సభ్యురాలు. 1916లో ఇండియన్ హోం రూల్
ఉద్యమ స్థాపకురాలు. అనేక స్కూళ్ళను స్థాపించిన భారత దేశాభిమాని.
జలియన్ వాలాభాగ్
సంఘటన జ్వాలలు రేపింది.ఉప్పుసత్యాగ్రహం గొప్పది.చూపించాడు తన గుండెలను కాల్చమని తెల్లదొరల కు "స్వరాజ్యం నా జన్మహక్కు" అన్నాడు ప్రకాశం పంతులు
ఎందరో త్యాగధనుల
కష్ట నష్టాల ఫలితమే
మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలు. వారిలో మన తాతలు ముత్తాతలు ఉన్నారు.
వారి ఆస్తులను పంచుకొన్నట్లె వారి సేవా త్యాగ గుణాలను కూడా మనం పంచుకొందాం; పెంచుకొందాం;.ఉంచుకొందాం వారి తలపులను
స్వాతంత్య్ర దిన సందర్భంగా వారందరినీ స్మరించుకుందాం.అందరం కలిసి ఎగుర వేద్దాం మన వైజయంతిని పైకి పైకి పై పైకి పైకి. .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి