బ్రతుకు బ్రతకనివ్వు (Live and let live): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
 గొప్పగా బ్రతకడం అంటే
నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతకనివ్వు 
Live and let live 
అంతే కానీ 
ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేనితనమోద్దు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని మహనీయుల వాక్ స్ఫూర్తిని పాదుగొల్పడం
ధనమదంతో పేట్రేగిపోయి
ఇతరులను అవహేళన చేయడం కాదు 
గొప్పగా బ్రతకడం అంటే వ్యక్తిప్రేమలు మరచి
వస్తుప్రేమలకు మరిగి 
వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపడంకాదు
గొప్పగా బ్రతకడం అంటే 
మాతృభాషను తుంగలో తొక్కి పరాయి భాషకు పట్టాభిషేకం కట్టడం కాదు
గొప్పగా బ్రతకడం అంటే 
ఆపన్నులకు అండగా ఉండడం 
బాధాతప్తులకు ఓదార్పునివ్వడం
వృద్ధులు, వికలాంగులు వితంతువులు ,అనాథల ఎడల దయార్ద్ర హృదయంతో ఉండడం 
గొప్పగా బ్రతకడం అంటే 
మన వ్యక్తిగత సౌఖ్యం చూసుకోవడం కాదు
మన వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించుకోవడం
గొప్పగా బ్రతకడం అంటే 
నమ్మిన వారిని నట్టేట ముంచి ఆర్థిక సామాజిక హోదాను చూపడం కాదు
  వసుధైక కుటుంబ భావనను అమలుచేయడం
ఆర్థిక సామాజిక ఘనమైన హోదా అని అనకుండా
 ఇతరుల పట్ల మనం మానవత్వాన్ని చాటడం
అంతే కానీ 
మనకున్నది ఇతరులకు లేనిది 
ఇతరులకున్నది మనకు లేనిది 
అహంభావం అని అనుకుంటే దానిని వదిలేద్దాం 
మనమందరం ఎప్పటికైనా మృత్యువాత పడేవాళ్ళమేకదా
మనం ఎందుకీ
 కామ, క్రోధ ,లోభ ,మోహ, మద ,మాత్సర్యాలు ప్రదర్శించక దైవిక గుణాల్ని అందిపుచ్చుకుందాం
రేపు మనం మరణించిన చిరంజీవులుగా వర్థిల్లుదాం
సర్వేజనా సుఖినోభవంతు 
సర్వేసుజనా సుఖినోభవంతు


కామెంట్‌లు