ఉత్తమ ఆచార్యుడు :- నామ వెంకటేశ్వర్లు S A (తెలుగు ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటి పాముల,
బంగారమసొంటి భరత భూమి లోన 
 వెలసిన 28 రాష్ట్రంల లో 
 కలదు అన్నపూర్ణయైన ఆంధ్ర రాష్ట్రంమొకటి 
 ఆంధ్రమునకు రాజధాని హైదరాబాదు 
 అందు నిర్మించే  ఉస్మాన్ ఉస్మానియా క్యాంపస్ న  కళల కళాశాల నొకటి 
 అందు కలవు పెక్క విభాగములు 
 అందుండే తెలుగు విభాగమొకటి 
 ఇంటికి యజమాని తండ్రి వోలె  తెలుగు శాఖకు తేజస్ నివ్వగా అధ్యక్షుడై నారు 
 నడుముకు పంచె తలకు పాగా పైపంచె దరించి పచ్చ తెలుగు వారిగా ఆగుపించి  
తెలుగు శాఖ కు వన్నె తెచ్చెను      అతనే మాకు గురువు రఘుమన్న 
 మనసు చూడ మల్లెపూవు తెలుపు 
 గొంతు చూడ కోయిలను పోలి 
 పలుకు చూడ చాలా వినసొంపు 
 తేనెలొలుకు  తేటైన మాటలతో
 మాలో ఉత్తేజము నింపెను కదా 
తెలుగు శాఖ యందు తేజముగ నుండి ఆ శాఖ కు ఎంతో వెలుగు తెచ్చెను కదా
అతనే మాకు పి. జి  తెలుగు లో ఒజ్జ రఘుమన్న నామము 
 కవటము లేని మాటలతోనే మాపై కాంతి ప్రసరింపజేసే 
 కప్పల వల్లే అరిచే కపట నటులను సైతం తన కవిత్వం తో కామూషి గా నోరు మూయించె కదా 
 చల్లనైన వెన్నెల చనుకులేసి చురుకుగా మమ్ములను తీర్చిదిద్దె 
 నారికేల పాకం లాంటి పద్య భాగములను ద్రాక్ష పాకంగా చేసి మాకు అందించె,                   మంచి చదువరులుగా మమ్ము తీర్చిదిద్దినారు 
 పల్లె పదాలు పాడి పాట నడక నేర్పినారు 
 సమయపాలనను చక్కగా పాటించి 
 తెలియజేసె మాకు మా భావి విద్యుక్త ధర్మమును 
 పుట్టు తెలుగు వారమైన మనం ఎల్లవేళలా తెలుగె మాట్లాడమన్నారు 
 నిండుకుండవలె నిజాయితీగా నుండి 
 మాలోని బర్భరతను మాయ చేసె 
 సర్వ వేదములెల్ల చక్కగా చదివి 
 అందుండు సత్యములను వెలువరించే 
 తా నేర్చిన జ్ఞానంలో కొంత మాకందించే మక్కువగ మాకు 
 బ్రాహ్మణమంటే  కులము కాదని
 బ్రాహ్మణ మంటె జ్ఞాన భాoడామని  తెలియ పరిచే మాకు
 కులభేదము లేదు వర్ణ బేధము తప్ప యని విషధపరిచే మాకు 
 సాహిత్య సమరము న సవాలు విసిరి సమరభేరి మ్రోగిస్తే 
 సాటి వచ్చిన వారు కల్ల 
 తుదకు తాను కవి శాసనుడనె బిరుదు పొంది  యుండే 
 పరిశోధన ప్రకల్పమునందు పట్టుబట్టి రామాయణ భారత భాగవతాది మొదలు సర్వసాహిత్యము, సిద్ధాంతములు  విశ్లేషించి అనేక గ్రంథమును ముద్రింప చేసి  
 అతనెవరో కాదు అతనె రఘుమన్న నామము మాకు గురువు, ఉత్తమ ఆచార్యుడు పి. జి. తెలుగు లో కళల కళాశాల యందు, 

       


కామెంట్‌లు