ఏమని తెలుపను మీ స్థితిని
ఎంతని పొగడను మీ మనోగతిని!
నా మనో మందిరమున కొలువైన
శాంతి కాముకులు మీరేను!
మీ కంటిచూపు నేర్పు భాష్యము
ప్రసాదించెను జీవిత పరమార్థము…
మౌనముద్రలో సద్భోదలు చేసినట్టి
గురుఃబ్రహ్మ స్వరూపులు!
అమాయకతను ఆయుధముతో
అరిషడ్వర్గములను అధిగమించి…
అద్భుతమౌ చిద్విలాస చిన్ముద్రలో
అమలిన మనస్కులు మీరు..!
కనులారా కాంచుతారు
మనసారా మన్నించుతారు…
ప్రేమ తప్ప కోపించుట ఎరుగని
మీకు లేరు ఎవరు సరిసాటి !
మలిపినారు ఉజ్వలముగ
మీ నడవడికను రాచబాటలో…
మలిచినారు ఉన్నతులుగ
మీ దయార్ద్ర గొడుగు నీడలో..!
పెరిగినాము మీ నైజమైన
మంచితనపు సహజశైలిలో…!
పొందినాము ఉచ్ఛస్థితిని
సదా మీ స్మరణలో…!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి