మరచిపోలేని వేసవి జ్ఞాపకాలు:- ఇట్టబోయిన వైష్ణవి-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం -జనగామ జిల్లా
 నా పేరు ఇట్టబోయిన వైష్ణవి.నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల ఘణపురం మండలంలో పదవ తరగతి చదువుతున్నాను. నేను ఈసారి వేసవి సెలవుల్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను.మా అక్క పెళ్లి  కుదిరటంతో పెళ్లికి ఐదు రోజుల ముందు కుటుంబంతో సహా హైదరాబాద్ కి వెళ్ళాము.
మొదటి రోజు షాపింగ్ చేశాము. తర్వాత రోజు మా అక్క తోటి వెడ్డింగ్ షూట్ కి వెళ్ళాను. మూడో రోజు పెళ్లి కూతురుని చేసి హల్ది ఫంక్షన్ ఎంతో సంతోషంగా జరిపాము.మే నెల16వ తేదీన పెళ్లిలో మా ఆనందానికి హద్దులు లేవు.పెళ్లి సందడి తర్వాత మా అక్క అప్పగింతలప్పుడు అందరూ ఎంతో బాధపడ్డారు.ఆరో జు అలా గడిచిపోయింది.మరునాడు నల్లపూసల కార్యక్రమం పూర్తి చేశారు.ఆ తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను.అక్కడ నేను,మా మామ కూతురు ఇద్దరం కలిసి కంప్యూటర్ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాము.దట్టమైన నల్లమల అడవులను,ఆ పచ్చదనం చూస్తుంటే నాకెంతో ఆనందం కలిగింది.అక్కడ మేమందరం ఫోటోలు దిగాము.పచ్చని ప్రకృతిని ఫోటోలలో బంధించాము.ఆ రోజు రాత్రి శ్రీశైలంలో గదిని అద్దెకి తీసుకొని నిద్ర చేసి తెల్లవారుజామున పాతాళ గంగకు వెళ్లాము.అక్కడ పడవ ప్రయాణం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది.ఆ తర్వాత గంగలో స్నానాలు పూర్తి చేసుకొని దర్శనానికి వెళ్ళాము. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నప్పుడు నాకు ఎనలేని ఆనందం కలిగింది. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.భోజనం చేసిన తర్వాత శ్రీశైలం ధర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాము. విద్యుత్ ఉత్పత్తిని గురించి తెలుసుకున్నాము. సాయంత్రం షాపింగ్ పూర్తి చేసుకుని మా ఊరికి ప్రయాణం అయ్యాము.ఈ ప్రయాణం నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించింది.

కామెంట్‌లు