రాహుల్ సాంకృత్యాయన్11....:- అచ్యుతుని రాజ్యశ్రీ

 బుద్ధిని పట్ల భక్తిగౌరవాలు సారనాథ్,బుద్ధిని నిర్యాణప్రాంతంచూశాక పెరిగాయి.దాదాపు కాలినడకతోనే లుంబినీ చేశాడు.అక్కడ ఉన్న ఆలయంముందు మేకలు కోళ్లను బలిఇవ్వడం చూసి అవాక్కైనాడు. కపిలవస్తు వెళ్లి అక్కడి శిధిలాల్ని చూసి సీతామఢితర్వాత ధనుషా చేరాడు. రాముడు ధనుర్భంగంచేసి సీత ను చేపట్టిన ప్రాంతం అది.నలందా మ్యూజియం అలా అన్ని ప్రాంతాలను చుట్టిన ఆయన బెంగాల్లో కాలినడకన పర్యటించారు.నదియా అనే ప్రాంతంలో ఒక భజనాశ్రమంలో ఓ50మంది వితంతువులు అర్ధశేరుబియ్యం కోసం హరేరామ అంటూ రోజంతా పాడటం గమనించాడు.కలకత్తా పూరీ,తిరుపతి ఆపై తిరుమశిచేరాడు.ఇక్కడ మీమాంస, వేదాంత, అష్టాదశ రహస్య గ్రంథాలు చదివాక కూర్గ్ చేరాడు.కన్నడ తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు.4నెలలు పర్వతప్రాంతాలు తిరిగాడు. అప్పుడే సహాయ నిరాకరణోద్యమం ఆరంభమైనది.తండ్రి మరణవార్త తెలిసింది.బొంబాయి వెళ్లి ఖద్దరుదుస్తులు ధరించి ,గంజాయి కల్లు జంతుబలికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.వరదల్లో  ఛప్రాప్రాంతం అల్లాడేసమయంలో ఆయన చేసిన సేవ చెప్పుకోదగ్గది.జలియన్ వాలాబాగ్ హత్యాకాండతో దేశం అట్టుడికిపోయింది .1922లో రాహుల్జీని బక్సర్ సెంట్రల్ జైల్లో పెట్టారు.రాజకీయ ఖైదీలు పగలు చెట్లకింద కుస్తీ కవితాగోష్ఠులు నాటకాలు మతగ్రంథాలతో కాలక్షేపం చేసేవారు.కానీ రాహుల్జీ చదవడం రాయడంలో మునిగిపోయేవాడు. "విశ్వబంధుప్రదీప్" అనే సంస్కృత పద్యకావ్యం 6సర్గలు,"కురాన్ సారం"సంస్కృతంలో రాశాడు.దాన్ని హిందీలో అనువాదం చేశాడు.ఇక్కడ ఓపియం చెప్పాలి.జైలు జైలుసిబ్బంది పచ్చి దొంగలు.కూరగాయలు,సరుకులు ఖైదీలకు వండకుండా ఇంటికి పట్టుకెళ్లేవారు. డాక్టర్ కూడా ఆస్పత్రి వస్తువులు,మందులు,ఆఖరికి కోడిపెట్ట ను కూడా కాజేసేవాడు. ఇలా 6నెలలతర్వాత రాహుల్జీ జైలునుండి విడుదలైనాడు(సశేషం)
కామెంట్‌లు