కేవలం 11ఏళ్ల ప్రాయంలో రాహుల్ జీ కి వివాహం చేశారు పెద్దలు.4వక్లాస్ పిల్లల సంఖ్య కేవలం13మాత్రమే. ఉర్దూ విద్యార్ధి ఈయన ఒక్కడే.కానీ హిందీలో కూడా పాండిత్యం సంపాదించాడు. ఈయన ఇంకో విద్యార్ధి మాత్రమే పాసైనారు. స్కాలర్ షిప్ కోసం మరో పరీక్ష రాయాలి.అప్పుడే కన్నతల్లి కన్నుమూసింది.కానీ అమ్మమ్మ నే అమ్మ అని పిలిచేవాడు.ఎందుకంటే తల్లిదండ్రులు వేరే ఊరిలో ఉంటే రాహుల్ అమ్మమ్మ తాత దగ్గరే ఉండిపోయారు.నిజామాబాద్ అనే ప్రాంతంలో మిడిల్ స్కూల్ ఉండేది.ప్రసిద్ధ హిందీకవి "హరిఔధ్" అక్కడివారే! రాహుల్ క్లాస్ ఫస్ట్! లెక్కలు కొట్టిన పిండి.భూగోళం ఆమాష్టారు రాహుల్ చేత పాఠం చెప్పించేవారు. ఆరోజుల్లో మాష్టార్ల జీతం నెలకు 20రూపాయలు.సంసారం పిల్లాపీచు వృద్ధ అమ్మ నాన్నలు అవ్వతాతలతో కల్పి 20మంది ఉండే కుటుంబాలు.పరీక్షల టైంలో రాత్రీపగలు దగ్గర కూచోబెట్టుకుని చదివించేవారు.రాత్రిపూట నిద్రపోతున్న పిల్లల్ని ముక్కుపట్టి గుంజేవారు.లాంతరు బుడ్డీదీపం వెలుగులో చదివించేవారు.రాహుల్ మాత్రం రాత్రిపూట చదువుకి ఎగనామం పెడితే లెక్కల మాష్టార్ చేత తొలిసారి దెబ్బలు తిన్నాడు.మ్యాపులు,ప్రాంతాలు చక్కని రంగుల తో అద్భుతంగా వేసి మన్ననలు పొందేవాడు.ఆరో క్లాస్ పరీక్షలు కాగానే అమ్మమ్మ గారి ఊళ్లో ప్లేగు ప్రబలం కావటంతో తండ్రి ఉన్న ఊరు కెళ్లాడు. ముగ్గురు తమ్ముళ్లు చదువుతున్నారు .అమ్మమ్మ ప్లేగుతో లోకం వీడింది. ఇక రాహుల్ లో కొత్త ఊహలు మొలకెత్తసాగాయి.తాత ఒంటరిగాడు కావటంతో చెల్లి రాంప్యారీని తీసుకుని తాత దగ్గర ఉండసాగాడు. ఒకసారి 2 శేర్ల నెయ్యి ఒలకబోశాడు. అంతే! తాత తిడ్తాడనే భయంతో 20రూపాయలతో నడుచుకుంటూ అజంగడ్ స్టేషన్ లో రైలెక్కి హవడా స్టేషన్ లో దిగాడు. అక్కడ ఇంట్లోంచి పారిపోయివచ్చిన తన ఈడు కుర్రాడు కలిశాడు.మరి తిండితిప్పలకోసం కూలీగా మారాడు.అదృష్టవశాత్తు ఓ 55ఏళ్ల వ్యక్తి తన దగ్గర రాహుల్ ని పనివాడు గా చేరదీశాడు. ఆయన కి హుక్కా చేసివ్వటం, గది ఊడ్వటం చేశాడు.ఆయన రాహుల్ కి ఇంగ్లీషుభాష ని నేర్పసాగాడు. (సశేషం)
రాహుల్ సాంకృత్యాయన్ 5:-అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి