"" మాట... తూట!"":- డా. ఆళ్ళ నాగేశ్వరరావు-(కమల శ్రీ)-తెనాలి-7416638823
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
కత్తితో శరీరానికి అయ్యే గాయం..
ఎప్పటికైనా మాని తీరుతుంది!
మాటలతో మనసుకు అయిన గాయం...
ఎప్పటికి మానక పోగా,
మానని గాయంలా మిగులుతుంది.
మనస్సుని మానసికంగా వేధిస్తూనే ఉంటుంది!

గడచిన కాలం,
పొర్లిన జలం,
నోరు దాటిన మాటను తిరిగి వెనుకకు తేలేము.
వాటిని పొదుపుగా వాడుకోవాలి.
మాటను అదుపులో ఉంచుకుంటూ,
ఆచి తూచి మాట్లాడాలి!

మాట్లాడేప్పుడు సంయమనంతో ప్రవర్తించాలి.
తుపాకి తూటాలైనా గురి తప్పవచ్చునేమో గాని,
వదలిన మాటల తూటా మాత్రం
అనుకున్న గమ్యాన్ని చేరుతుంది;
అనుకోని ఉపద్రవాలను సృష్టిస్తుంది!

మంత్రాల మాటలకు చింతకాయలు రాలక పోవచ్చునేమో గాని,
ఈ మాటల అస్త్రాలకు అనర్ధాలు జరగడం ఖాయం!
మాట్లాడేటప్పుడు విజ్ఞతను
ప్రదర్శించడం అత్యవసరం!!!
*********

కామెంట్‌లు