వేసవి జ్ఞాపకాలు:- కేమిడి రుక్మిణి-7వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
 నా పేరు కేమిడి రుక్మిణి. నేను ఏడవ తరగతి చదువుతున్నాను.నాకు వేసవి సెలవులు అంటే చాలా ఇష్టం.ఈ వేసవి సెలవులలో నేను ముందు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను.మా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం.మా పెద్దనాన్న నాకోసం చాలా పళ్ళు తీసుకువచ్చేవాడు.నేనంటే వారికి ఎంతో మమకారం.మా పెద్దమ్మ నాకు వంటకాలు ఎలా చేయాలో నేర్పించింది.మా అన్నయ్య,చెల్లి,తమ్ముడు చాలా ఆటలు ఆడుకున్నాము. ప్రతిరోజు సాయంత్రం పొలం గట్టుకు వెళ్లడం నాకు ఎంతో ఆనందంగా అనిపించేది. సమయం తెలియకుండానే వేసవి సెలవులు  పది రోజులు గడిచిపోయాయి.ఆ తర్వాత నేను,మా చెల్లి, తమ్ముడు మా ఊరికి వచ్చాము.మధ్యాహ్నం పూట అష్టా చమ్మా, పుంజీతం,పులి మేక, వామన గుంటలు ఆడుకునే వాళ్ళము. బొమ్మల గీయడంతోపాటు చేతిరాత అభ్యాసం చేసేవాళ్లము.మా ఇంటి పక్కన ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇద్దరు చిన్న పిల్లలు వచ్చారు.వారు ఎంతో ముద్దుగా ఉన్నారు.వారితో రోజు మేము ఆడుకుంటుంటే సమయం తెలిసేది కాదు. వేసవి సెలవులలోనే నా పుట్టినరోజు వస్తుంది.మా ఇంటిలో ఆనందోత్సాహాల మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము. బడిబాటలో భాగంగా జూన్ నెలలో మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మా ఇంటికి వచ్చారు. వారితోపాటు నేను కూడా బడిబాటలో పాల్గొన్నాను. కొంతమంది విద్యార్థులు కొత్తగా బడిలో చేరారు నాకు చాలా సంతోషం అనిపించింది. మా అమ్మానాన్నలకు అమ్మాయి, అబ్బాయి అని తేడా ఉండదు. నాకు బైక్ నడపడం,ఈత కొట్టడం నేర్పించాడు. నన్ను, తమ్ముడిని ,చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు.ఈ వేసవి సెలవులు నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చాయి.

కామెంట్‌లు