మహాత్ముల తపశ్శక్తి మహిమ: - " కావ్యసుధ "-" ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ "-9247313488-హయత్ నగర్.
 పూజ్యశ్రీ మలయాళ స్వాముల వారు పుట్టింది కేరళలోనే అయినా చిన్నప్పుడే తెలుగు ప్రాంతానికొచ్చి ఎంతో ఇష్టంతో తెలుగుని కావాలని నేర్చుకున్నారు. కేవలం ఏదో అలా వ్యక్తులతో మాట్లాడడానికి సరి పోయినంత తెలుగుభాషని నేర్చుకోవడం కాదు- ఆ తెలుగుభాషలో తెలుగువారు కూడా చదివి ఆనందపడే విధంగా ఉండే శైలిలో గ్రంథాలని రాయగలిగినంత స్థాయిలో తెలుగుభాషమీద అధికారాన్ని సంపాదించారు. శ్రీ మలయాళస్వామివారు.
అంతేకాదు, సామాన్య వ్యావహారిక భాషలో ఉండే తెలుగు కాకుండా గ్రాంథికభాషలో తెలుగుని కేరళ జన్మస్థలంగా కలిగివుండి కూడా మొత్తం తన జీవి తం ఉన్నంతకాలం డెబ్బె రెండు గ్రంథాలని తెలుగులో  లోకానికి అందించారు. ఇక తెలుగు ప్రసంగాలకీ, సంస్కృత వేదాంత గ్రంథాల అనువాదానికీ సంఖ్యని చెప్పనే అక్కరలేదు.
అలాటి మలయాళస్వాములవారు తన ఆరాధ్యదైవ మైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికివున్న గోగర్భంలో తపస్సుని ప్రారంభించారు.
రోజూ నిత్యతపస్సు సాగుతూ వుండేది.భక్తులకి,ఆ మార్గంలో ఉన్నవారికి మాత్రమే, ఒకపక్క దర్శనం ఇస్తూనే తపస్సు కొనసాగించడం ఎంత కష్టం!
అయినా నియమ సమయపాలనని చేయడంలో దిట్ట అయిన మలయాళస్వాములవారు ఏనాడూ తన నియ మాన్ని తప్పనే లేదు. ఓ రోజున తపస్సు ముగించి వారు వస్తూంటే ఓ పెద్దపులి దాదాపు
పది అడుగుల బారు వున్నది ఆయనవద్దకే వచ్చి గాండ్రించింది. ఆయన ఆ సందర్భంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తూ ఓ!వ్యాఘ్రమా!
ఈ లోకానికి నా ద్వారా ఏదైనా ప్రయోజనముందని నీకనిపిస్తే నన్ను విడిచివెళ్ళిపో! నా జీవితం వ్యర్థమే అని నీకనిపిస్తే నిస్సందేహంగా నన్ను తిని నీ ఆకలిలో కొంతని తీర్చుకో! నిర్ణయం నీదే! అంటూ కనులు మూసుకుని అలాగే దానిముందు నిలబడిపోయారు.
తెగించాక భయమెందుకు? కాసేపు అలాగే నిల బడిన పులి మరోమారు గాండ్రించి వెళ్ళిపోయింది! అదీ తపశ్శక్తి మహిమంటే!

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం