నా పంచపదుల సంఖ్య---
1747-1748.
1747..
పేర్లేవైనా మాదకద్రవ్యం ,
క్రమేపి జీవనం శూన్యము!
అలవాటు విష యంత్రం, చిక్కితే బిగింపు ఖాయము!
తాత్కాలిక సుఖం మత్తు ,
మన చిత్తం పై ఆదిపత్యము!
అవన్నీ చెదపురుగులే,
జీవన దూల ప్రవేశము!
బతుకు సౌధం నేలకూలడం, హఠాత్తుగా సంభవము,
పివిఎల్!
1748.
మాదకద్రవ్యాల వ్యాపారం, సామాజిక అత్యాచారము!
యువత భవిత భద్రత,
జూదమే ప్రాణమే పణము!
ఇదొక పెద్ద సవాల్, అంతర్యుద్ధం స్వీయరక్షణము!
మాదకద్రవ్య బహిష్కొరం,
స్వచ్ఛ సమాజ నిర్మాణము!
ఈ రోజేనా? ప్రతిరోజూ, కార్యాచరణే పరిష్కారము,
పివిఎల్!
_______
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి