అనగనగా ఒక అడవిలో ఒక తేనెటీగ ఉండేది. అది సోమరిపోతు. దానికి ఏ పని చేయాలన్నా కూడా బద్ధకం అనిపించేది. రకరకాలుగా ఆలోచిస్తూ కాలక్షేపం చేసేది. అంతే కాదు దానికి తన శక్తి సామర్ధ్యాల పై విపరీతమైన నమ్మకం ఉండేది. నాకంటే శక్తివంతురాలు మరొకటి లేదన్న సంగతి తన మనసులో ఊహించుకునేది.
ఒక రోజు ఎప్పటిలాగే తేనెటీగ ఖాళీగా చెట్టు కొమ్మపై కూర్చొని గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉండేది. ఆ కొమ్మను తానే ఊపినట్టు ఊహించు కునేది. ఇంతలో గడ్డి మేస్తూ ఎద్దు ఒకటి ఆ చెట్టు సమీపంలోకి వచ్చింది. దాన్ని చూడగానే ఝుమ్మంటూ రెక్కల చప్పుడు చేస్తూ వెళ్లి ఆ ఎద్దు పై వాలింది.
" మిత్రమా!ఎలా ఉన్నావు..? ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని రకరకాలుగా అడిగింది. ఎద్దుకు దాని మాటలు వినిపించలేదు సరి కదా.... అసలు తనపై తేనేటీగ వాలింది అన్న సంగతే తెలియ లేదు. నేను నీ మీద కూర్చున్నాను. నీకు బరువైతే మొహమాటపడకుండ చెప్పు సుమా! ఎగిరిపోతలే అంది.
ఎద్దు దాని మాటలు పట్టించుకోకుండానే గడ్డి మేయడంలో మునిగిపోయింది. ఇంతలో గాలి దుమారం వచ్చింది. ఆ గాలి విసురుకు తేనేటీగ ఒక్కసారిగా పైకి లేచింది. రెక్కలు టపటప లాడిస్తూ ఎద్దు పైనే నిలిచే ప్రయత్నం చేసింది. కానీ సుడిగాలికి నిలువలేకపోయింది. ఆ గాలి దుమారం బలంగా వీయడంతో దూరంగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మకు చిక్కింది. బతుకు జీవుడా అంటూ తన ప్రాణాలను రక్షించుకోగలిగింది. కొద్దిసేపటి తర్వాత గాలి దుమారం తగ్గింది. మళ్లీ అటు ఇటు తిరుగుతూ ఎద్ధుని సమీపించింది. ఎద్దు అదే ప్రాంతంలో గడ్డి మేస్తూ స్థిరంగా అక్కడే ఉండగలిగింది .
అప్పుడుగానీ తేనెటీగకు తన శక్తి ఏపాటిదో అర్థం అయింది. కానీ ఒప్పుకోవడానికి దానికి అహం అడ్డు వచ్చింది. ఆ...ఒక్క ఎద్దు మాత్రమే నా కంటే బలమైనదిలే...! అనుకుంటూ రివ్వున ఎగిరి పోయింది.
--

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి