ఉక్కుపాదం ఎత్తు! ఉగ్రవాదం చిత్తు!:- డా పివిఎల్ సుబ్బారావు.-9442058797.
1.
ఉగ్రవాదం ఉన్మాదం,
     శాంతికి మతిభ్రంశము!

శాంతి వృక్షం వేరు చేరే, చీడపురుగు ఉగ్రవాదము!

శాంతి సత్వ లక్షణం ,
అశాంతి తమో రాజసము!

ఉగ్రవాద ఆకాశాన శాంతి, రెక్కలు తెగిన కపోతము!

ఉగ్రవాదంపై ఉక్కు పాదం ,
అది నీ పాదాక్రాంతము! 

2.
ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్కటై, ఉగ్రవాద పీచ మణచాలి!

ఆపరేషన్ సిందూర్,
 విశ్వమంతా కలిసి నడవాలి? 

ఉగ్రవాదం దెబ్బతిన్న పులి, వెంటాడి వేటాడి చంపాలి!

పాముకి పాలు పోయకు, డేగవై చీల్చిపారెయ్యాలి!

ఉగ్రవాద సహకారం మన ,
ఇల్లు మనమే అగ్నిసమర్పణం!

3.
ఉగ్రవాద నిర్మూలన ప్రజల, కళ్ళే తుపాకీ గుళ్ళు కురవాలి! 

గొర్రెల మందలో చేరి ఉన్న, ప్రాణం తీసే తోడేళ్లేవాళ్లు!

గొర్రె లేకమై కాళ్ళతో,
 తొక్కేస్తే చస్తాయి ఆ తోడేళ్లు!

తప్పించుకుపోలేరు వాళ్ళు ,
 సీసీ కెమెరాలు ప్రజల కళ్ళు! 

ప్రజల ఐకమత్యమే, తీవ్రవాదసౌధ అశనిపాతం!
4.
తెల్లవారినే తరిమింది, భారతీయుల సంఘటితశక్తి! 

ఉగ్రవాదులేపాటి ,ఉరికే,
 గంగ ముందు గరికపాటి! 

వారిది ఆక్రమ కుయుక్తి ,
మనది అకళంకిత దేశభక్తి!

ఉగ్రవాద నిర్మూలన ,
విశ్వమానవశ్రేయో ఆసక్తి! 

ప్రపంచం ఒక ప్రభంజనం, ఉగ్రవాదం సమూల నాశనం! 

5.
ఉగ్రవాదం చాప కింద నీళ్లు! 

ఉగ్రవాదం విషవటవృక్షవేళ్ళు! 

ఉగ్రవాదం పచ్చకామెర్ల కళ్ళు !

పరాక్రమం తొక్కాలి పరవళ్ళు! 

ఉగ్రవాదానికి పడాలి సంకెళ్లు!
_________


కామెంట్‌లు