ఆత్మవిశ్వాసం: -అంకాల సోమయ్య దేవరుప్పుల -జనగామ 9640748497

అమ్మా ! గాలిపటం కొనివ్వు ప్లీజ్ ..
ఆరుబయట ఎగరేసుకుంటాను.
ఆడపిల్లవు నీకెందుకే గాలిపటాలు అని 
హోమ్ వర్క్ చేయమని నోట్ బుక్ చేతికిచ్చింది.
నోట్ బుక్ లోని పేజీలతో గాలిపటం తయారుచేసి ఆకాశం తాకేలా ఎగరేసింది.
ఆ ఊహ నేడు నేను పైలట్ కావడానికి ఆధారభూతమయ్యింది.
(ఆత్మవిశ్వాసం గలవారే ఊహలను సాకారం చేసుకుంటారు)

కామెంట్‌లు