కలం చెప్పిన సత్యాలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
పని చేస్తే నవ్వుతూ
ఏదీ కష్టం కాదోయ్!
చిరునవ్వులు రువ్వుతూ
జీవిస్తే నష్టం రాదోయ్!

ఇష్టాన్ని పెంచుకొమ్ము
అదే కదా నీ సొమ్ము
ఆత్మవిశ్వాసాన్ని నమ్ము
చూపించుము గుండె దమ్ము

పొరపాట్లు అతి సహజం
అది మానవ నైజం
దిద్దుకుంటే గౌరవం
అక్షరాల వాస్తవం

పెంచుకో వ్యక్తిత్వం
పంచుకో దైవత్వం
అమూల్యమైనది బ్రతుకున
చాటుకో దాతృత్వం


కామెంట్‌లు