మాటలు :-లలితాకుమారి -(లలితా చండి )-హైదరాబాదు --9885552922
సాహితీ కవికళాపీఠం
సాహితీ కెరటాలు 
--------------------------
మాటలు కొన్ని మహామంత్రాలు
మరి కొన్ని ఆకర్షణయంత్రాలు
ఆస్వాధించే హృదయాలకు
అదను చూసి వేసే అదృశ్య  కళ్లాలు

ఈ మాటలే.. స్పందించే మనస్సులకు 
 మత్తెక్కించే పారిజాతాలు,
మరులు గొలిపే ప్రియనేస్తాలు,
మాటల విన్యాసాలు లెన్నో... 
 సంధించే ఆకర్షణ అస్త్రాలు,

మాటలు కొన్ని అంతర్ మధన కన్నీటి చారికలను తెలిపే అభిసారికలు,  
మాటలు కొన్ని అంతః కలహాలకు మూలమై,
 అనుబంధాలను ధ్వంసం  చేసే  అదృశ్య కర వాలాలు

విశ్వ యోగుల మాటలు 
 బహుముఖాలుగా
భువన రాగ మాలికలను పాడే గీతాలు'...
బ్రతుకు బాటలకు జ్ఞాన ప్రభోధాలు. 



కామెంట్‌లు