ఆమె మా కాదర్శం: - కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం-9963265762.
చెరగని చిరునవ్వుతో
అనురాగ ఆప్యాయతలతో
ఎప్పుడు కనిపించినా
ఎలా ఉన్నారు మాష్టారు అని
పిల్లలు,మనుమలు ఎలా ఉన్నారని
పలుకరించి ఆశీర్వదించే
చిట్టిమామ్మ అంటే
ఏడు పదుల వయసున్న నాకే కాదు
అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న
ఎక్కడున్న వారైనా  
అందరు బాగుండాలి
అందులో మనం ఉండాలి
'లోకా సమస్తా సుఖినో భవంతు'  అన్నదానికి ప్రతీకగా
తొంబది ఐదు సంవత్సరాల వయస్సులోకూడా
సనాతన ధర్మాన్ని వదలక
నిత్యం సమాజ శ్రేయస్సుకే
అంకితమై అసలయిన స్వయం సేవక్ గా
శ్రీరాముని దరి చేరిన
భర్త సుబ్రహ్మణ్యం గారి అడుగు జాడల్లో నడిచే
ప్రతి ఏట సీతా రామకల్యాణం కు
మొదట తన ఫించను లో
ధన సహాయం చేసే
మా అమ్మ  ఓరుగంటి వెంకటలక్ష్మమ్మ (చిట్టి మామ్మ) 
మా పాలిట డొక్కా సీతమ్మయే
ఆమె   శతవసంతాలు ఆరోగ్యంగా ఉండాలని
మా అందరికి ఆమె ఆదర్శమని
ఆమె చరణాలకు ప్రణమిల్లుతున్నా...!!

(జ్యేష్ఠ శుద్ధ సప్తమి ప్రముఖ సనాతన ధర్మ వారధి ప్రతీక ఓరుగంటి వెంకట లక్ష్మీ ( చిట్టి మామ్మ)  95 వ పుట్టిన రోజు సందర్భంగా)
..........................

........................

కామెంట్‌లు