అతి ముఖ్యం - మన నమ్మకం : --గద్వాల సోమన్న, 9966414580
వెలుగుతున్న దీపము
ప్రేమకు ప్రతిరూపము
మహోన్నతుడు దైవము
చేసుకోకు దూరము

ఆలయమే హృదయము
భగవంతునికిష్టము
పవిత్రంగా ఉంటే
చేయునోయ్!నివాసము

పనికిరాని పనులతో
చేయరాదు మలినము
అనుదినము చేయాలి
హృదయాలను శుభ్రము

గగనంలో సూర్యుడు
హృదయంలో దేవుడు
పిలవాలోయ్!నిత్యము
పలకాలోయ్! సత్యము

ఉంచాలి నమ్మకము
కాయు దైవ నామము
దేదీప్యమానమై
వర్ధిల్లు జీవితము


కామెంట్‌లు