సమంగా చూసుకో!:- --గద్వాల సోమన్న, 9966414580
దేనిని తీసుకోకు
ఏమాత్రం తేలిక
అన్నీ ఉపయోగము 
తెలుసుకొనుము నీవిక

భగవంతుని సృష్టిలో
ఏది కాదు వ్యర్థము
తెలుసుకో ఈ సత్యము
ఇచ్చుకో గౌరవము

చేయరాదు ఎవరిని
కలనైనా తక్కువ
అన్నిటిపై పెంచుకో
మనసులోన మక్కువ

సమానంగా చూస్తే
దైవానికి ఇష్టము
భేదాన్ని చూపిస్తే
అంతులేని నష్టము


కామెంట్‌లు