సాహితీ కళాపీఠం .సాహితీ కెరటాలు .============"మౌన ప్రేమ"పదేపదే ఆమెను తలుచుకుంటున్న నేను-గుర్తొచ్చి నవ్వుకుంటున్నా.మదిలో మెదిలే రూపం -ఉషోదయమని,నడిచే ఆమె పాదం -స్వరాలపాదమని,కదిలే ఆ పెదవులు- స్వాతి చినుకుల సవ్వడని,ఎగిరే ఆ కురులు-బాపూ బొమ్మవని,నడిచే ఆ నడక-హంస నడకని,మెచ్చే ఆ రూపం-కుందనపు బొమ్మని,ఊహలతో విహరిస్తుంది నా మనసు.కనులు మూస్తే -కలలో అలలా వచ్చిహృదయ మీటను తాకుతావుకనిపించని; ఆరూపానికి ఎన్ని అగచాట్లు!కనిపిస్తే-ఇవ్వలేనిపుష్పాలు,చేరువైనా -కదలని పెదాలు.అన్నీ మౌన భాషలే.నిశ్శబ్దమెందుకో రాజ్యమేలుతోంది.వ్యక్తీకరణకు సాహసం లేకనా?కుల మతాలు- అడ్డొస్తాయనా?పెద్దలు ,అంగీకరించరనా?ఏమైనా, మబ్బులతోనైనాకబురంపాలి.నా ప్రేయసికి -నా మౌనప్రేమ వినిపించమని.
"చెలికెలా తెలపను":- బెహరా నాగభూషణరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి