కవివర్యా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఊహలు ఊరించు
ఉల్లాలు మురిపించు
అక్షరాలు కురిపించు
పదాలు పారించు

సరిగమలు చిందు
పదనిసలు వదులు
తనువులు తట్టు
మనసులు ముట్టు

శ్రావ్యత ఒసగు
ఘనత చాటు
వెలుగులు చిమ్ము
చీకట్లు త్రోలు

అధరాలు తెరువు
తేనెచుక్కలు చల్లు
తియ్యదనాలు చేర్చు
తనువులు తృప్తిపరచు

పరిమళాలు వెదజల్లు
పరవశాలు కల్గించు
సొంపులు చూపించు
ఇంపులు చేకూర్చు

దీపాలు వెలిగించు
కాంతులు ప్రసరించు
వెన్నెల ప్రసరించు
విహారాలు చేయించు

కలాలు కదిలించు
కాగితాలు నింపు
కవితలు కుమ్మరించు
కమ్మదనాలు అందించు


కామెంట్‌లు