సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు------------------------హరహరమహాదేవ శంభో శంకరనటరాజువై నీవు నటనమాడగ..మెడలోనాగేంద్రులు బుసకొట్టి ఆడరుద్రాక్షమాలలే చిందర "వందరాయె..ఢమరుకముతో లోకాలు ధ్వనించిమూడవకన్ను నిప్పులే కురవగా..త్రిశూలమే చూసి ఆశ్చర్యపోవగానీ భీకరరూపానికి భీతినొందే వేళ అనుగ్రహించు శివా..!నీలకంఠా శాంతించు, దయాకర విశ్వేశా..ఎల్లవేళలా నీనామ స్మరణే మాకుశరణ్యం...నిరతము నీ అనుగ్రహముతోకాపాడు మహేశ్వరా...సాగర మథన సమయాన జనించినవిషాగ్నిని కంఠముననిలిపావు...మహాదేవా!కైలాసనిలయా!నాగభూషణా!నీకసాధ్యమన్నది ఏమున్నదిమహేశ్వరా...!దయాసాగరా!భక్తవత్సలా!ముక్తిమార్గము ప్రసాదించు..!అడిగింది లేదనవుఅసాధ్యం కాదనవుకనపడకున్నా కష్టాలు తీరుస్తావు..!కసాయినైనా మహనీయుని చేస్తావు...లయకారుడివైనా లక్షణంగారక్షిస్తావు...!కాలకూట విషమైనా కాదనకభక్షించే చంద్రకళాధరా....కావగరావా జంగమదేవర...!నింగినీ నేలనూ ఏకం చేసేమహాప్రళయంలోనైనా నిర్బయంగా నిలిచే కారుణ్యమూర్తివి...!భక్తవత్సలుడవనే మాటకుముక్తినిచ్చి నిరూపించే సదాశివా!త్రిశూలధారీ!తవ చరణాలే శరణం ప్రభో!!
:వందే శివం శంకరం...!!:- డా.మరుదాడు అహల్యా దేవి-బెంగళూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి