విశాఖ సాగర తీరం, భీమిలి మండల సమీపంలో ఉన్న చారిత్రక ఆనవాళ్ళు గల పర్యాటక కేంద్రం,తొట్లకొండలో పచ్చని ప్రకృతి అందాల మధ్యన నింగి ఈ నేలకు దిగిందాయన్నట్లుఆదివారం అనగా ఆదివారం ఆరు గంటలకు ఆయుష్ యోగా,ఆర్ట్ ఆఫ్ లివింగ్ , జిల్లాలో ప్రముఖమైన యోగా సంస్థలు అన్నీ కలసి ప్రభుత్వం వారి సూచనల మేరకు ఏకమై ఒకేచోట ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జూన్ 21 జరుగ బోవు ఉత్సవాలకు నెలరోజులకు ముందే యోగా గురువులకు, వాలంటీర్లకు శిక్షణ జరుగుతున్న విషయం తెలిసిందే!
యోగా శిక్షణ వచ్చేవారం పోర్ట్ స్టేడియంలో జరుగుతాయని తెలియ జేశారు.
ఇందులో జిల్లా కలెక్టర్ హరిందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డిఓ సంగీత్ మాథుర్ వంటి విశాఖ పాలక నాయకులు పాల్గొన్నారు.
మయాన్మార్ బౌద్ధ గురువులు,శాంతి ఆశ్రమం గురువులు చివరగా వారి ఉపదేశంతో యోగా కార్యక్రమం ముగిసింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి