వేసవి సెలవుల్లో ... : -జి. అమృత వర్షిణి.-విజయ హై స్కూల్ , కాప్రా, హైదరాబాద్ ,
 శ్రీయుత గౌరవనీయులైన ప్రిన్స్ పాల్ గారికి నమస్కారములు.
ఈ సంవత్సరం 2025 వేసవికాలం సెలవులలో నేను జరిపిన పర్యటన వివరాలను తమకు తెలియజేస్తున్నాను. మొదటి పదిరోజులపాటు పూర్తిగా ఇంటిపట్టుననే ఉండి మా అమ్మకు పనులలో సాయం చేస్తూ కొన్ని చిన్న చిన్న పనులు ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇంకా తమరు ఇచ్చిన హోంవర్క్ కూడా పూర్తి చేశాను. మా అమ్మమ్మ తాతయ్యలతో ఆతరువాత పదిరోజులు మెదక్ వెళ్ళాను. అక్కడ అమ్మమ్మ తాతయ్య తో సహా కుటుంబ సభ్యులందరం కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న వనదుర్గామాత ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మను భక్తితో పూజించి మన స్కూల్ లోని టీచర్లు, విద్యార్థులు బాగుండాలని మొక్కుకున్నాను. ఏడుపాయలుగా విడిపోయిన మంజీరా నదిని చూడటానికి రెండుకళ్ళు చాలవు. అక్కడ మూడు రోజులు గడిపి తిరిగి మెదక్ వచ్చి అక్కడ అమ్మమ్మ, తాతయ్యలతో చర్చికి, పార్కులకి వెళ్ళాము అటుపైన తిరిగి హైదరాబాదు మా యింటికి వచ్చాము. హైదరాబాదులోని మా బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చాము. ఇలా ఎంతో సరదాగా, సందడిగా సెలవులు గడిచి పోయినాయి. 
ఇట్లు 
ధన్యవాదాలతో 
తమ విద్యార్థిని 

జి. అమృత వర్షిణి.

విజయ హై స్కూల్ , కాప్రా, హైదరాబాద్ , 
కామెంట్‌లు