రాజేంద్ర ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తాడు. చిన్నప్పటి నుంచీ అతనికి చదువులో పోటీనే లేదు. దాంతో రాజేంద్రకు గర్వం తలకెక్కింది. ఇప్పుడు రాజేంద్ర 10వ తరగతికి వచ్చాడు. అదే తరగతిలో మహేంద్ర అనే మరో విద్యార్థి ఉండేవాడు. మహేంద్ర చదువులో యావరేజ్.
ఇద్దరూ 10వ తరగతికి వచ్చారు. పాఠశాల పునఃప్రారంభం నాడే పాఠాలు మొదలు పెట్టడం ఎందుకని ఉపాధ్యాయుడు వాసు మాస్టర్ డ్రాయింగ్ పోటీలు పెట్టాడు. మహేంద్ర చాలా అందమైన బొమ్మను అద్భుతంగా వేసినాడు. ఉపాధ్యాయుడు మెచ్చుకుని మంచి బహుమతి ఇచ్చాడు. రాజేంద్ర బీభత్సంగా కుళ్ళుకున్నాడు.
విరామ సమయంలో బయటకు వచ్చిన మహేంద్రతో రాజేంద్ర "ఏవో బొమ్మలు బాగా వేసినంత మాత్రాన గొప్ప వాడినని విర్రవీగకు. చేతనైతే చదువులో నాతో పోటీపడు. నీకు 8 నెలల టైం ఇస్తున్నాను. ఈ 8 నెలలూ బాగా కష్టపడి నా కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. 10వ తరగతి ప్రీ ఫైనల్స్ లో నా కంటే ఎక్కువ మార్కులు వస్తే నీకు బంగారు ఉంగరాన్ని కొని ఇస్తాను." అన్నాడు రాజేంద్ర. అక్కడే ఉన్న సీనియర్ విద్యార్థి రాము దీనిని సీరియస్సుగా తీసుకున్నాడు. రాము పూర్వ విద్యార్థి. అత్యంత తెలివైన వాడు.
రాము మహేంద్ర వద్దకు చేరాడు. "ముమ్మాటికీ గెలుపు నీదే. నేను నీకు చదువులో చాలా సహాయం చేస్తాను. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ తర్వాత ఏదైనా సాధ్యం. చదుపుకు కావలసింది ఏకాగ్రత. ఉపాధ్యాయులు చెప్పే పాఠాను ఏకాగ్రతో విను. అది చాలా ముఖ్యం. ఆపై నీకు తిరుగు లేదు." అన్నాడు రాము. మహేంద్ర ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వినడం ప్రారంభించాడు. అనుమానాలను ఉపాధ్యాయులచే నివృతి చేసుకున్నాడు. రాము తరచూ మహేంద్ర ఇంటికి వచ్చేవాడు. మహేంద్రకు చదువులో సహాయం చేసేవాడు. మహేంద్ర పాఠాలు ఏకాగ్రతతో వింటున్నాడు. అనుమానాలు నివృతి చేసుకుంటున్నాడు. ఏకాగ్రతతో పాఠాలు వింటూ చదువులో ఉపాధ్యాయుల చేత సందేహాలను నివృతి చేసుకుంటూ కొద్ది రోజులలోనే మహేంద్ర చాలా తెలివైన విద్యార్థి అయినాడు.
రాజేంద్రది చిన్నప్పటి నుంచీ బాగా బట్టీ పట్టే చదువే. విషయాలను శ్రద్ధగా వినాలి అనే ఆలోచన లేదు. ఎక్కువ సమయం ఇంటి వద్ద బట్టీ పట్టడానికే కేటాయించే వాడు. చిన్నప్పటి నుంచీ మరో తెలివైన విద్యార్థి లేక రాజేంద్రకు ఎదురే లేకుండా పోయింది.
కాలం గడిచింది. 10వ తరగతి ప్రీ ఫైనల్స్ అయిపోయాయి. మహేంద్ర క్లాస్ ఫస్ట్ వచ్చాడు. రాజేంద్ర షాక్. అహంకారం మంచులా కరగిపోయింది. అందుకే చదువు బాగా రావాలంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. సందేహాలను సిగ్గు పడకుండా ఉపాధ్యాయుల చేత నివృతి చేసుకోవాలి. బట్టీ పట్టే విధానం అసలే వద్దు. అహంకారం మనకు శత్రువు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి