సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-902
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ " న్యాయము
****
పరోపకారం అనగా ఇతరులకు మేలు చేయుట, ఇతరులకు మంచి చేయుట , ఇతరులకు సహాయం చేయడం.పుణ్యాయ అనగా పుణ్యము కొరకు, సత్కార్యం కొరకు. పాపాయ అనగా  పాపము చేయడం,దుష్కృత్యం. పర పీడనం అనగా ఇతరులను బాధ పెట్టడం, హాని చేయడం, హింసించడం. పీడనం అనగా బాధ,హింస అనే అర్థాలు ఉన్నాయి.
ఇతరులకు ఉపకారము చేయడము వల్ల పుణ్యమూ,బాధ పెట్టడము వల్ల పాపమునూ కలుగుతాయి అని అర్థం.
 మరి ఈ న్యాయము యొక్క పూర్తి శ్లోకాన్ని చూద్దామా!
అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కథితం/పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్!!"
అనగా మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి విరచించిన అష్టాదశ పురాణములలో అనగా 18 పురాణములలో చెప్పిన సారాంశం ఏమిటంటే పుణ్యము కొరకై పరులకు ఉపకారము చేయాలి. పాపము కొరకై పరులకు హాని చేయవలెను. 
 ఎవరైనా పాపము కావాలని కోరుకోరు కదా! కాబట్టి ఉపకారమే చేయాలి.ఉపకారము చేయడం వలన పుణ్యాన్ని సంపాదించవచ్చు.ఇతరులకు హాని చేసినట్లయితే పాపము కలుగుతుంది. అందుకే ప్రజలకు ఉపకారము కొరకై ధర్మ కార్యాలను చేయాలనే సందేశం ఇందులో యిమిడి ఉంది.
 వ్యాస మహర్షి రచించిన పురాణాల సారాంశములో మాత్రమే పరోపకారం చేయాలని ఉందా? మరి ఎందరో ఎన్నో గ్రంథాలు రాశారు కదా!మరి వాళ్ళు చెప్పిన ఉద్గంథ్రాలలో ఏమి చెప్పబడిందో దాని సారాంశాన్ని ఒక్క శ్లోకములో చెప్పగలరా? అని కాళిదాసుని అడిగారట.
 అప్పుడు కాళిదాసు చెప్పిన శ్లోకం ఇదే...
"శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః!/పరోపకారాయః పుణ్యాయ పాపాయ పరపీడనమ్!!"
అనగా అనేక కోట్ల గ్రంథాలలో చెప్పిన సారాంశాన్ని ఒక అర్థ శ్లోకములోనే చెబుతాను.పరులకు ఉపకారము చేస్తే పుణ్యం వస్తుంది.హాని చేస్తే పాపం వస్తుంది అని చెప్పాడు.
 దీనినే మన పెద్దలు ఇంకొకరికి మన వల్ల మేలు  జరిగితే అది పుణ్య కార్యంగానూ, మన వల్ల కీడు కలిగితే పాపము గానూ చెప్పడం జరిగింది.
మరి ఇతరులకు ఎలాంటి మేలు తలపెట్టాలి? పరోపకారం అనగా ఏమిటి అనే సందేహాలు మనలో మెదులుతూ ఉంటాయి.
 పరోపకారం అనగా ఇతరులను కాపాడుటకు అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేయడం.
మరి అలాంటి పరోపకారం ఎందుకు ముఖ్యమైనది? ఎందుకు చేయాలి? అనే మరో ప్రశ్న తలెత్తుతుంది.
దీనికి సమాధానంగా ఏమిటంటే ఒకరికొకరు సహకరించుకోవడమనే సద్గుణము అలవడుతుంది.ఇతరులకు అవసరమైన సమయంలో చేసే ఉపకారం వారిలో ఆత్మవిశ్వాసం,ఆత్మ స్థైర్యం పెంచడానికి, ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఉపయోగపడుతుంది.
 ఇలాంటి పరోపకార లక్షణాలు ఉండటం వల్లనే ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో అనగా పూర్వకాలంలో  ప్రజలు ఎన్నో రకాల యిబ్బందులను, క్లిష్టమైన పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కొన్నారు.
 పరోపకారంలో స్వార్థం ఉందా? నిస్వార్థమైనదా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు పుణ్యం లభించాలనే స్వార్థం, కోరిక తప్ప అందులో కీడు కనిపించదు కాబట్టి పరోపకారం నిస్వార్థమైనదే అని చెప్పవచ్చు.
కొన్ని జంతువులలో కూడా పరోపకార లక్షణాలు కనిపిస్తాయి. మనం ఆహారం పెట్టినా పెట్టకపోయినా  వీధి కుక్కలు ఎవరైనా కొత్తవారు, దొంగలు ఆ ప్రాంతంలో తిరిగితే అరిచి హెచ్చరించి  మనకు మేలు చేస్తాయి.
అలాగే అనేక రకాల జంతువులు,పక్షులు వాటిలో అవి ఉపకారం చేసుకుని జీవించడం మనం గమనించవచ్చు.
మొత్తంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరోపకారం ఎంతో ఉత్తమమైన,త్యాగపూరితమైన గుణం. దీని వలన ఇతరులకు మంచి జరుగుతుంది.
పర పీడనం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం కలుగుతుందో ఏమో కానీ దాని వల్ల దుష్టులు, దుర్మార్గులుగా ముద్ర పడిపోతుంది.*మానసికంగా అలాంటి వారు ప్రశాంతంగా ఉండలేరు.లోలోపల అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.
కాబట్టి పరోపకారం, భూతదయ భారతీయుల లోని ఉన్నతమైన గుణ సంపద. దీనిని విడువకుండా బతుకంతా చేతనైనంత వరకు పరోపకారం చేస్తూ జీవిద్దాం.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం