ఉందాము':- ---డా.పోతగాని సత్యనారాయణ
(ఒత్తులు లేని బాల గేయం -3)

వడిగా బడికి పోదాము
గురువుల మాట విందాము
నడవడి తెలుసు కుందాము 

శుచిగా మనము ఉందాము 
రుచిగా వంటలు తిందాము
ఆచితూచి అందాము

ఆటలు ఆడుకుందాము
సాయం చేసుకుందాము
తెలివిని పెంచుకుందాము



కామెంట్‌లు