సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==================
కదలాడే జటాజూటంలో గంగ
నుదుట విభూది మెరవంగా,
చెదరని త్రినేత్రం
నిప్పులై వెలుగంగా.
సూర్య, చంద్రులు నేత్రాలై,
విశ్వమే నీ మోముగా,
విషమే కంఠాభరణంగా,
నాగరాజు హారమై నిలవంగా.
నింగియే శరీరమై,
శ్వాసయే శక్తిగా మారగా,
ప్రాణమే వాయులింగమై,
లోకాలనేలు తల్లి అర్ధభాగంగా.
తాండవించే నటరాజువై,
పులి కళేబరమే దుస్తులై,
డిం డిం ఢమరుకమే నాదమై,
త్రిశూలమే నీ ఆయుధమై.
నీలకంఠుడై కైలాసనాథుడవై,
సర్వమూ తానై నిలవగా,
పరమశివుడు ప్రత్యక్ష రూపంగా
జయహో జయహో పరమేశ్వరా!
ఓం నమః శివాయ జపింతుముగా!
పరమేశ్వరా..:- డా. మంజుప్రీతం కుంటముక్కల -మదనపల్లె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి