"ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావ్? ఓహో ఉత్తరంలో రాశావు కదా. ఆ సుందరి కోసమేనా?"
ప్రేమ చంద్ మిత్రుని భుజం మీద చెయ్ వేస్తూ అన్నాడు.
తన భుజం మీద చేయిపడడం చూచి సుధీర్ వెనక్కు తిరిగి అవున్రా ఆవిడ కోసమే చూస్తున్నాను.
అన్నాడు తన చూపులు వచ్చే ఆవిడ కోసం నలువైపులా పంపిస్తూ.
"ఇంతకీ ఆమెను ఎక్కడ కలుసుకున్నావు ఇద్దరికీ స్నేహంఎలా ఏర్పడింది" ఆన్న స్నేహితుని మాటలకు,
హలో అది పెద్ద కథ ప్రేమించుకోవడం అంటే విశ్వమంత ఆనందం మన మనసులో దూరుతుంది. అందుకే తర్వాత చెప్తాను.
నువ్వు ఏవి అనుకోకుండా ఇంటికి వెళ్లి స్నానం చేసి టిఫిన్ చేసి ఉండు నేను తనను పిలుచుకొని వస్తాను అన్నాడు సుధీర్.
నువ్వు ఎంతసేపు అని కాచుకొని ఉంటావు" అన్న స్నేహితుని మాటలకు
"మరుజన్మ వరకు వేచి ఉంటా.
చూడు బ్రదర్ ఇవన్నీ
స్వయం అనుభవాలు
మామధ్య ప్రేమ
మాకే తెలుస్తుంది"
అంటూ సుధీర్ చెప్తుండగానే ఆటో వచ్చి వాళ్ల ముందు ఆగింది. అందులో నుంచి మెరుపు తీగలా దిగిన సుగంధ లతను చూచి ప్రేమ్చంద్ అవాక్క
య్యాడు.
ఆటో దిగి వాళ్ళకు దగ్గరగా వచ్చిన లత ప్రేమ్చంద్ చూచి
ఆశ్చర్యపోతూ
"నువ్వెక్కడున్నావ్ ఏంటి !" అన్నది
కొంచెం పెద్దగా.
ఆమె మాటలకు జవాబు చెప్పేస్థితిలో ప్రేమ్చంద్ లేడు. అలాగే నిలుచుకొని ఉన్న ప్రేమచంద్ ను చూసి హలో బ్రదర్
నిన్నే
ఆవిడ అడిగేది" అన్నాడు సుధీర్. ఆమె అందానికి స్నేహితుడు అవాక్కయ్యాడన్న భావనతో.
"నేను సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు"అన్నాడు ప్రేమ్చంద్ లతను చూచి.
ఇక్కడికి నా స్నేహితురాలు లావణ్య వస్తానన్నది ఆమె హైదరాబాద్లో ఎక్కిన బస్సు ఇక్కడే ఆగుతుంది అందుకని తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను" అన్నది సుగంధలత.
ఇంతలో హైదరాబాద్ బస్సు రానే వచ్చింది అందులో నుండి దిగిన
లావణ్య, బస్సు దిగుతూనే
సుధీర్ వైపు చూచి కొంచెం సిగ్గుతో తల దించుకుంటూ,
"సారీ సుధీర్ బస్సు లేట్ అయింది" అంటూ
సుగంధలత వైపు చూసి,
నువ్వు కూడా వచ్చావా నాకోసం
అన్నది తిన్నగా.
"నువ్వు కూడా అంటే నీకోసం మరెవరు వచ్చారు? "అన్నది లత.
"ఇదిగో ఈయన. సుధీర్ నాకు కాబోయే పతి దేవుడు".
అంది సుధీర్ వైపు చూపిస్తూ లావణ్య.
"
సరీ సరి
"ఒరేయ్! ఇందాక నువ్వు ఏమన్నావ్? ప్రేమ, దోమ స్వయం అనుభవాలన్నావు
చెప్తున్నా విను నా అనుభవం. ఈ నాజూకు సొగసుల అతివ సుగంధ లతకు నేను సాక్షాత్ పతి దేవుణ్ణి. నువ్వు ఫారెన్ లో ఉండటం వల్ల నా సతీమణిని చూడలేదు.
ఇదే దైవధీనం అంటే
ఇలామన జంటలు కలుసుకోవడం చాలా త్రిల్లింగ్ గా
ఉంది. నిజంగా వర్ణించాలంటే ఆకాసం అరచేతిలో చిక్కినట్లు ఉందిరా" అంటూ
స్నేహితుని కౌగలించుకొన్నాడు ప్రేమ చంద్. స్నేహితురాలిద్దరూ కిలకిల నవ్యారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి