తల్లి ఋణం తీర్చుకున్న తనయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
ఘోర దూషణల...


తుపానులు గర్జించినా...
తిరస్కారాల ఘోషలు... 
హద్దులు దాటి దాడిచేసినా...
తన నీతి నిజాయితీ నిబద్ధతను 
నిరుపేదల హక్కులుగా ఆశయాలుగా 
మార్చి...భారత ప్రజాస్వామ్య శిల్పానికి 
"మెరుగులు దిద్దిన మహా మేధావి"... 
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్..!

వర్ణ వర్గ వివక్షల మంటలపై
"జ్ఞాన వానను" కురిపించి
ఆశ్రితుల కన్నీటి జలాల్లో
సమానత్వపు కమలాన్ని 
"వికసింప జేసిన విశ్వనరుడు"...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్..!

సిరాచుక్కలతోకాదు 
తన రక్తంతో లిఖించి...
రత్నాల కన్నా విలువైన
ఒక "కోహినూర్ వజ్రం" లాంటి 
భారత రాజ్యాంగాన్ని కానుకగా
తల్లి భరతమాతకు సమర్పించి...
"తల్లి ఋణం తీర్చుకున్న తనయుడు" 
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్..!

అపార జ్ఞానానికీ...
అణచివేతలకు అగ్నిపరీక్షలకు...
చెక్కుచెదరని చక్కని ప్రతిరూపం...
"భారత రాజ్యాంగ గర్భగుడిలో ఆరక 
"వెలిగే అగ్నిదీపం"...డా.బిఆర్ అంబేద్కర్"..!


కామెంట్‌లు