సముద్రం : - జయా
సముద్రమూ
ఓ కావ్యమే
 
అందులో 
ప్రతి కెరటమూ
ఓ అధ్యాయమే 

ప్రతి అధ్యాయమూ
అనేక సంగతులతో
తీరానికొస్తుంది

అప్పుడు
చదువుకున్న వారికి
చదువుకున్నంతే
సముద్రకావ్యం


కామెంట్‌లు