పితృ దినోత్సవ సందర్భంగా రాసినకవిత
================================
"నాన్న" లో నా అన్నది నాకెంతోఇష్టం.
"నావాడు "నాన్న అన్న అర్థం అందులో
పరమార్ధం.
అమ్మ కడుపులో నేను
ఉండగానే
నీ ఊహలలో నేను అయ్యాను i A S
కన్నావు కమ్మని కలలు నీ పిల్లలకోసం
కోసం
కొన్నావు మాకెన్నో
మేమడిగినవన్నీ.
మాచదువులకు నీ
"శక్తి" అనే ఆస్తిని
అర్పించావు.
నేర్పించావు జీవిత గమనానికి కావలసిన అడుగులను.
నాన్న!. ఈరోజు ఎంతో సుదినం
నీకంటూ ఒక దినం ప్రపంచమంతా చేస్తున్నది చూడు. పితృ దినోత్సవ సందర్భంగా
నీ పుత్ర ,పుత్రికలమంతా
ఆత్రంగా ఎదురు చూస్తున్నాము
వచ్చేసావా,విచ్చేసావా
స్వచ్ఛమైన నీ ప్రేమను
మా కందించావు నీవందుకో మేము ఇచ్చే ఈ విందును.
శతవిథాల మా మంచి కోరే నువ్వు దీవించు మమ్ము "శతమానంభవతి" అని. ఇదిగో, అందుకో మా వందనం👣🙏🏼
నాన్నా!నువ్వు లేకుండా
మాకన్నమే దిగదు.
నీ కన్న మా కెవరు
ఎక్కువే కాదు.
అమ్మ సౌభాగ్యమ్ము,
ఇంటిభోగభాగ్యములు మాఅనురాగదీపములు
అవి వెలగాలి నిత్యం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి