మేనమామ.- సి. హెచ్. అనసూయ.-హైదరాబాద్.
సాహితీ కవి కళా పీఠం.
సాహితీ కెరటాలు.
=============
చందమామ నాకు, మేనమామ.
అమ్మ ఇందిర, బుజ్జి తమ్ముడు.
అయ్య శివయ్య కి, నెత్తిన ప్రాణం.
"చేసే వన్నీ కొంటె పనులు ".

నన్నుచూసి నవ్వుతాడు," కోణంగి"
బుగ్గగిల్లి, ఏడిపిస్తాడునన్ను.
కబుర్లు, కధలు, ఎన్నో చెప్తాడు.
చల్లగా లాలిపాట, పాడతాడు.

"చిలిపి ఊహలు", నాలో రేపుతాడు.
కుదురుగ,ఒకచోట కూర్చొనివ్వడు.
తనఅందం, చూపించిమురిపిస్తాడు.
వెంటపడి, మరీ ఏడిపిస్తాడు.

"అందగాడినని" మహా పొగరు!
పోదూ! నీబడాయి... చాలు చాలు.
చూసుకోవోయి, నీ క్రింది మచ్చలు.
అంటే అది," దిష్టి చుక్క" అంటాడు.

"మత్తుమందు "చల్లి మరులు గొల్పు.
మదిని హాయిగొల్పే,మన్మధుడు.
ఎవరైనాచూస్తారని, దాక్కుంటాడు.
మహా పెద్దమనిషిలా,నటిస్తాడు.


"పోకిరీ "పనులు మహామెండు
అమ్మ తో! చెపుతా... నుండు.
రాత్రి వచ్చి, గిలిగింతలు పెడతాడు.
తెల్లారిమాయమౌతాడు, పచ్చిదొంగ.
"జీవితమే చందమామ "అవునేమో!
ఆ.....వాడే! నా రాజు, "నెలరాజు".


కామెంట్‌లు