అది ఒక తరగతి గది.
మాష్టారు తన విద్యార్థులను అడిగారు: "ఒక చెట్టు మీద నాలుగు పక్షులు ఉన్నాయి. వాటిలో మూడు ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నాయి. అప్పుడు చెట్టుమీద ఎన్ని మిగిలి ఉంటాయి?"అని.
విద్యార్థులందరూ ముక్తకంఠంతో "ఒక్కటి" అని సమాధానం ఇచ్చారు.
కానీ ఒక విద్యార్థి మాత్రం లేచి నిల్చుని, "నాలుగు పక్షులు ఉన్నాయి" అని జవాబివ్వగా అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు.
అప్పుడు మాష్టారు "అదెలా" అని అతనిని ప్రశ్నించారు.
అప్పుడా విద్యార్థి ఇలా జవాబిచ్చాడు...
"ఓ మూడు పక్షులు ఎగరాలని నిర్ణయించుకున్నాయని మీరు చెప్పారు. కానీ అవి నిర్ణయించుకున్నట్లే ఎగిరిపోయాయని మీరు చెప్పలేదు. నిర్ణయం తీసుకోవడం తీసుకోవచ్చు. అంతా మాత్రాన అవి తమ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టినట్లు కాదు కదండీ. కనుక చెట్టు మీద నాలుగు పక్షులూ అట్టాగే ఉన్నట్లు కదండీ" అని.
నిజానికి, ఆ విద్యార్థి సమాధానం సరైనదే.
ఇది చిన్ని కథ కావచ్చు. కానీ కొంతమంది జీవితాలను ప్రతిబింబిస్తుంది. వారు ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడవచ్చు. నినాదాలు చేయవచ్చు. అంతమాత్రాన వాళ్ళు తాము చెప్పినట్లే జీవిస్తున్నారా అని ప్రశ్నించుకుంటే జవాబు లేదనే వస్తుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది వారి తీరు. అటువంటి వారు సమావేశాలలోను, స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ప్రకాశిస్తారు. కానీ వాస్తవానికి, వారి జీవితాలు వారి తీరు అందులో ప్రతిబింబించదు.
చాలా మంది మాట్లాడతారు, కానీ కొద్దిమంది మాత్రమే వ్యవహరిస్తారు.
నిర్ణయం తీసుకోవడం ఒక విషయం. కానీ దానిని ఆచరణలో పెట్టడం అనేది పూర్తిగా వేరే విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి