అంతర్మధనం : - కె కె . తాయారు
సాహితీ కవి కళా  పీఠం 
    సాహితీ కెరటాలు
==============
అంతర్ మధనం

తెలియ చెప్పాలని తహ, తహ !
విప్పలేని గళము,
 ముప్పిరి గొన్న భావావేశం!
ముదమార విప్పి,విశద పరచలేను!

ఎదలోని మమకార సేతు విచ్ఛిన్నం,
చేయవలెను,చేరలేను.తెలియని
బాధ,సంకోచంతో,పట్టి పీడించ, 
ఏదీ దారీ?ఈమనో వేదన,మన నీయదే !

ప్రేమ మధురిమలు, చేదాయెనా ?
చేరగనివ్వని మూర్ఖ,బధ్ధిహీనను,
దారిలేని, ఎడారి బాటసారికి,
దారి చూప నెవ్వరూ దిక్కు?

చిరు భీతితో చేరనివ్వదు
దురిత మౌనం నడుమ
చిక్కిన ఇక్కట్ల హృది !!


కామెంట్‌లు