సోము చిన్నప్పటి నుంచీ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. ఎప్పుడూ చెడు స్నేహితులు, ఆటలకే పూర్తి సమయం. సోము తండ్రి ఎప్పుడూ చదువు విషయంలో సోమును తిడుతుండేవాడు. చదువు విలువను బుజ్జగిస్తూ చెప్పేవాడు. అయినా మనోడి చెవికి అవి ఎక్కవు. సోము చెల్లెలు స్రవంతి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్. స్రవంతిని వాళ్ల నాన్న ఎప్పుడూ మెచ్చుకునేవాడు. బహుమతులు ఇచ్చేవాడు.
ఫాదర్స్ డే నాడు స్రవంతి చాలా అందంగా ఒక బొమ్మను గీసి తండ్రికి బహుమతిగా ఇచ్చింది. తండ్రి సంతోషించి స్రవంతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆశీర్వదించాడు. సోము తాను ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా తన తండ్రి సంతోషించడు. కారణం చదువు విషయంలో తాను తన తండ్రిని నిరాశ పరుస్తున్నానని సోము అనుకున్నాడు.
కాలం గడుస్తున్నది. చెడు స్నేహితులు స్వార్ధపరులు, చెడు స్నేహితుల వల్ల చెడిపోవడం తప్ప మరొకటి ఉండదని సోము గ్రహించాడు. పూర్తి సమయం చదువుకే కేటాయించినాడు. సోము 9వ తరగతి పూర్తి అయింది. వేసవి సెలవులు వచ్చాయి. ఆ సెలవులలో సోము తన గురువు రారింటికి ట్యూషన్ వెళ్ళాడు. సెలవులు పూర్తి అయ్యాయి. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.
సోము ఒకరోజు ఆదివారం నాడు తన తండ్రి వద్దకు వచ్చి, పుస్తకాలు చేతికి ఇచ్చి 10వ తరగతికి సంబంధించిన చాలా విషయాలు చూడకుండా చెప్పాడు. ఇంకా 10వ తరగతి సిలబస్ మొదలు కాకపోవచ్చు. కానీ అప్పుడే తన కొడుకు ఇంత నేర్చుకున్నాడా? ఆశ్చర్యపోయాడు సోము తండ్రి. సోమును దగ్గరకు తీసుకున్నాడు. "హాపీ ఫాదర్స్ డే" అన్నాడు సోము. తన కొడుకు ఈరోజు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అనుకున్నాడు సోము తండ్రి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి