1...
నా నాస్తిక మిత్రుని "మొదటి" ప్రశ్న...
గుడి ఎందుకు..?
గుడిలో దైవమెందుకు..?
ఆ పరమాత్మ సర్వాంతర్యామి కదా....!
నా ఎదురు ప్రశ్నలు...
గాలి అంతటా
వ్యాపించి ఉండగా
ఇంటిలో ఏసీ ఎందుకు...?
గదిగదికి ఫ్యాన్ ఎందుకు...?
క్షణక్షణం గాలి పీల్చి వదలడమెందుకు..?
నా నాస్తిక మిత్రుడు మౌనవ్రతం దాల్చాడు
2...
నా నాస్తిక మిత్రుని "రెండవ" ప్రశ్న...
నాకు దైవాన్ని కళ్ళకు చూపించు...?
నా ఎదురు ప్రశ్నలు...
నీవు నిప్పును మూట కట్టగలవా...?
సముద్రంలోని అలలను ఆపగలవా..?
నీవు నీ చేతితో గాలిని పట్టుకోగలవా..?
కన్నార్పకుండా మిట్టమధ్యాహ్నం
సూర్యున్ని పదినిమిషాలు వీక్షించిగలవా.?
నీటి మీద నీవు నడవగలవా..?
మునిగిపోకుండా నిలబడగలవా...?
నా నాస్తిక మిత్రుడు మౌనవ్రతం దాల్చాడు
3...
నా నాస్తిక మిత్రుని "మూడవ" ప్రశ్న...
ప్రకృతిలో పంచభూతాల్లో దైవమెక్కడ..?
నేను సూర్య చంద్రుల
రాకపోకలను చెప్పగలను...
చుక్కల్ని లెక్కించగలను...
సముద్రాలను ఈదగలను...
కనిపించని దేవుని జ్ఞానం కన్న
కనిపించే మనిషి జ్ఞానమే మిన్న...
అహంకారం కాదిది అక్షర సత్యం...!
నా ఎదురు ప్రశ్నలు...
ఆ పర్వతం ఎత్తు ఎంత...? కొలిచాడు
ఈ పర్వతం పొడవు ఎంత..? కొలిచాడు
ఆ పర్వతం వెడల్పు ఎంత...? కొలిచాడు
ఈ పర్వతం బరువెంత..?...అంతే...
ఒక్కసారి అవాక్కయ్యాడు...
దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు...
బుర్ర గోక్కుంటున్నాడు...
జుట్టు పీక్కుంటున్నాడు...!
ఈ పర్వతం బరువెంతో...
"ఆ భగవంతున్నే అడగాలి" అన్నాడు...
జ్ఞానోదయం కలిగిన నా నాస్తిక మిత్రుడు
మౌనంగా సత్యాన్వేషణ ప్రారంభించాడు
సత్యమే దైవమంటే...
అసత్యమే అజ్ఞానమంటే...
అజ్ఞానమే అంధకారమంటే...
ఆ అంధకారాన్ని చీల్చే వెలుగే దైవమంటే..
ఆ భగవంతున్ని భక్తివిశ్వాసాలతో సేవిస్తే...
నీ అంతరంగంలోకి తొంగిచూస్తే అన్వేషిస్తే..
ఆ జీవాత్మ ఆ పరమాత్మల
సాక్షాత్కారం సాధ్యమే...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి