కాశ్మీరులోయలోని కుంకుమ పువ్వు తను
మానస సరోవరంలోనీ హంస తను
కైలాసంలో కరిగే మంచు లింగం తను
కలల కాటికాపరి స్మశానంలో భస్మం తను
అమ్మ తప్ప ఆలిలేని సత్య హరిశ్చంద్రుడు అతడు!!?
నది పుట్టినట్లు నక్షత్రాలు పుట్టినట్లు
పర్వతాలు పుట్టినట్లు సముద్రాలు పుట్టినట్లు
భూమిపై పుట్టిన గాంధీలా రాహుల్ అతను!!
ఆకాశం ఆహ్వానించింది
విశ్వం సహకరించింది
గాలి కౌగిలించుకుంది
ఒక ఆకర్షణ పుట్టింది గాంధీలా రాహుల్ గాంధీ లా!!
దేశంలో మోసం ఎరుగని ఉద్దేశం తనది
తరతరాలుగా త్యాగం తప్ప భాగం అడగని వంశం తనది.
అన్నీ కోల్పోయిన మిగిలి ఉన్న ఒకే ఒక దేశభక్తుడు అతడు.!!!
రాహుల్ గాంధీ పుట్టిన రోజు నేడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి